AP: వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌ని జంగారెడ్డిగూడెం పొగాకు రైతులు గురువారం కలిశారు. కేంద్ర ప్రభుత్వం విధించిన ఎక్సైజ్ డ్యూటీ, జీఎస్టీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని జగన్‌కు రైతులు వివరించారు. దాంతో పొగాకుకు డిమాండ్ తగ్గి, ధరలు పడిపోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పొగాకు రైతుల సమస్యలపై కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని జగన్ హామీ ఇచ్చారు. ఈ సమస్యలపై పార్లమెంటులో తమ ఎంపీలు చర్చిస్తారని చెప్పారు.