ఏపీ జెన్‌కో కొత్త ఎండీగా పొగాకు పుల్లారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ప్రస్తుతం ఏపీసీపీడీసీఎల్ ఛైర్మన్ అండ్ ఎండీగా ఉన్న పుల్లారెడ్డికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏపీ స్టేట్ ఎనర్జీ ఎఫిషియన్సీ డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఎండీ, సీఈవో, ఏపీ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ సీఈవోగానూ ఆయన కొనసాగుతారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.