మాఘ పౌర్ణమి రోజున దేవతలు పవిత్ర నదుల్లో స్నానం చేస్తారని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఇవాళ నదీ, సముద్ర స్నానాలు ఆచరించాలి. ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువు, శివుడికి పూజలు చేయడంతో పాటు దాన ధర్మాలు చేయడం వల్ల జాతక, పితృ దోషాలు తొలగి పాప విముక్తి లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఒకవేళ నదీ స్నానం చేయలేని వారు ఇంటి దగ్గరే స్నానం ఆచరిస్తూ ‘గంగే చ యమునే చైవ’ అనే శ్లోకాన్ని పఠించాలి. నేడు మద్యం, మాంసానికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.