టెట్ దరఖాస్తుకు నేడే లాస్ట్

0చూసినవారు
టెట్ దరఖాస్తుకు నేడే లాస్ట్
AP: పాఠశాల విద్యాశాఖ నిర్వహిస్తున్న ఏపీ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (APTET JUNE-2026) ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు ఈ జులై 5వ తేదీతో ముగియనుంది. 1 నుంచి 8వ తరగతి వరకు బోధించాలనుకునే ఉపాధ్యాయ అభ్యర్థులకు ఈ పరీక్ష తప్పనిసరి. డీఈఎల్ఈడీ, బీఈడీ పూర్తి చేసిన లేదా ఫైనల్ సెమిస్టర్ చదువుతున్నవారు cse.ap.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి పేపర్‌కు రూ.1000 రుసుము చెల్లించాలి.  ఆగస్టు 5 నుంచి 21 వరకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) పద్ధతిలో పరీక్షలు జరుగుతాయి. జులై 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 15న తుది ఫలితాలు విడుదల కానున్నాయి.

సంబంధిత పోస్ట్