నేడు కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన

0చూసినవారు
నేడు కుప్పంలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన
AP: సీఎం చంద్రబాబు కుప్పం పర్యటన నేడు రెండో రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రూ.9,322 కోట్ల విలువైన పలు అభివృద్ధి, సంక్షేమ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడంతో పాటు పలువురు పారిశ్రామిక సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకోనున్నారు. అలాగే రూ.952 కోట్లతో మూడు ట్రాన్స్కో సబ్‌స్టేషన్లు, ఇస్కాన్ ఆలయం, గ్రానైట్ హెరిటేజ్ స్టోన్ క్లస్టర్‌కు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కుప్పంలోని ప్రాజెక్టుల పురోగతిపై పారిశ్రామికవేత్తలు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్