నేడే కేంద్ర బడ్జెట్.. బడ్జెట్ బ్రీఫ్‌కేస్ ఎందుకు రెడ్ కలర్‌లో ఉంటుందో తెలుసా?

9092చూసినవారు
నేడే కేంద్ర బడ్జెట్.. బడ్జెట్ బ్రీఫ్‌కేస్ ఎందుకు రెడ్ కలర్‌లో ఉంటుందో తెలుసా?
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం నాడు పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఉదయం 11 గంటలకు బడ్జెట్ సమావేశం ప్రారంభం కానుంది. అయితే ప్రతి బడ్జెట్‌కు ఆర్థిక మంత్రి ఎర్రటి బ్యాగు తీసుకురావడం వెనుక బ్రిటిష్ పాలన ప్రభావం ఉంది. 1860 నుంచి ఈ సంస్కృతి కొనసాగుతోంది. బ్రిటన్‌లో ఎర్ర రంగు అధికారం, బాధ్యత, కీలక పదవిని సూచిస్తుంది. ఈ బడ్జెట్‌తో నిర్మలా సీతారామన్ ఒకే ప్రధానమంత్రి హయాంలో వరుసగా తొమ్మిదో సారి బడ్జెట్ ప్రవేశపెట్టే అరుదైన రికార్డు సొంతం చేసుకోనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్