భారీగా తగ్గిన టమాటా, ఉల్లి ధరలు

35404చూసినవారు
భారీగా తగ్గిన టమాటా, ఉల్లి ధరలు
AP: రాష్ట్రంలో టమాటా ధరలు భారీగా తగ్గాయి. దాంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం కర్నూలు జిల్లా పత్తికొండ మార్కెట్‌లో కేజీ టమాటా రూ.2కి పడిపోయింది. మదనపల్లె, నంద్యాల మార్కెట్లలో రూ.3-రూ.10 వరకు పలికింది. అటు ఉల్లి ధర కూడా పడిపోయింది. కర్నూలు వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌లో వ్యాపారులు ఉల్లి క్వింటా రూ.150 చొప్పున కొనుగోలు చేసినట్లు రైతులు వాపోయారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్