AP: కర్నూలు జిల్లా మార్కెట్లో టమోటా పంటకు గిట్టుబాటు ధర లభించక రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తికొండ, ప్యాపిలి వంటి మార్కెట్లలో కిలో టమోటా ధర రూ.5కు పడిపోయింది. లక్షల పెట్టుబడి పెట్టి పండించిన పంటకు రవాణా, కూలీల ఖర్చులు కూడా రావడం లేదని రైతులు వాపోతున్నారు. కొందరు రైతులు పంటను రోడ్లపై పారబోసి నిరసన తెలిపారు. ప్రభుత్వ అధికారులు మద్దతు ధర కల్పించాలని, టమోటా ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.