భారీగా పడిపోయిన టమాట ధరలు

110చూసినవారు
భారీగా పడిపోయిన టమాట ధరలు
AP: రాష్ట్ర వ్యాప్తంగా టమాటా ధరలు కుప్పకూలి రైతులను కన్నీళ్ల పాలు చేస్తున్నాయి. నెల రోజుల క్రితం కిలోకు రూ.30–40 పలికిన టమాటా ధరలు ఒక్కసారిగా సింగిల్ డిజిట్‌కు పడిపోయాయి. కర్నూలు, పత్తికొండ మార్కెట్లలో కిలోకు రూ.4–5 మాత్రమే లభిస్తుండటంతో కూలీ ఖర్చులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. మదనపల్లి మార్కెట్‌లోనూ నాణ్యతను బట్టి కిలోకు రూ.8 నుంచి రూ.13కే అమ్ముడవుతున్నాయి. మరోవైపు వ్యాపారులు మాత్రం ఇదే టమాటాను వినియోగదారులకు కిలోకు రూ.20–25కు విక్రయిస్తున్నారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్