భారీగా పడిపోయిన టమాటా ధరలు.. రైతుల ఆందోళన (వీడియో)

1చూసినవారు
AP: టమాటా రైతులకు మళ్లీ కష్టాలు మొదలయ్యాయి. నిన్నమొన్నటి వరకు మంచి ధరలు పలికిన టమాటా ఒక్కసారిగా భారీగా పతనమైంది. చిత్తూరు జిల్లా పలమనేరు వ్యవసాయ మార్కెట్‌లో ఇటీవల 15 కిలోల బాక్స్ ధర రూ.300 వరకూ పలికింది. ప్రస్తుతం కేజీ టమాటా ధర రూ.2 నుంచి రూ.5 మాత్రమే పలుకుతోంది. దాంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి ఖర్చులు కూడా రావడం లేదని, తమను ఆదుకోవాలని వందలాది రైతులు మార్కెట్ యార్డు ముందు ఆందోళన చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్