భారీగా పడిపోయిన టమాటా ధర.. కేజీ రూ.5

26906చూసినవారు
భారీగా పడిపోయిన టమాటా ధర.. కేజీ రూ.5
AP: రాష్ట్రంలో ఉల్లి, టమాటా ధరలు రోజురోజుకు భారీగా పడిపోతున్నాయి. దాంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం అన్నమయ్య జిల్లాలోని మదనపల్లిలో మార్కెట్‌లో టమాటా ధర కేజీ రూ.5కు పడిపోయింది. దిగుబడి పెరగడంతో ధరలు పతనమవుతున్నాయి. ప్రభుత్వం స్పందించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్