జేష్ఠ్య మాసంలో సోమవారం వచ్చే పౌర్ణమి అత్యంత పవిత్రమైనదని పండితులు చెబుతున్నారు. సత్యనారాయణ స్వామి వ్రతం, దానాలు, శివుడు, విష్ణు ఆరాధన చేయడం వల్ల మంచి
ఫలితాలు పొందవచ్చని అన్నారు. ఉదయం స్నానమాచరించి తులసి మొక్కకు నీరు పోసి, దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయాలన్నారు. దాంతో కుటుంబంలో శాంత్రి, శ్రేయస్సులు కలుగుతాయన్నారు. పితృ దేవతలను స్మరించడం వల్ల వారి ఆశీర్వాదం లభిస్తుందన్నారు.