AP: రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరగనున్న MPTC, ZPTC ఎన్నికల పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అయితే భారీ వర్షాలు, వరదల ధాటికి గుంటూరు జిల్లా పెదనందిపాడు, కాకుమాను, ఫిరంగిపురం మండలాల్లో పోలింగ్ నిలిపివేశారు. త్వరలో పోలింగ్ తేదీని ప్రకటిస్తామని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఏలూరు జిల్లాలోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, వేలేరుపాడు, పోలవరం మండలాల్లో ఎన్నికలను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.