కేంద్ర బడ్జెట్ 2026-27లో పర్యాటక రంగానికి పెద్దపీట వేశారు. జాతీయ పర్యాటక సంస్థ ఏర్పాటు చేసి, 20 పర్యాటక ప్రాంతాల్లో 10,000 గైడ్‌ల నియామకం చేయడం, MSMEలకు ప్రభుత్వ కొనుగోలు ద్వారా ప్రోత్సాహం వంటి చర్యలు తీసుకుంటామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. స్వయం సమృద్ధి భారత్ ఫండ్‌కు రూ.2వేల కోట్లు, సూక్ష్మ పరిశ్రమలకు రూ.2వేల కోట్లు కేటాయిస్తామని అన్నారు. 15 పురావస్తు ప్రాంతాలు అభివృద్ధి, పులికాట్ సరస్సులో పక్షుల వీక్షణకు ప్రత్యేక సౌకర్యం కల్పిస్తామని అన్నారు.