ఏజెన్సీ ప్రాంతాల్లో విజృంభిస్తున్న విష జ్వ‌రాలు

13444చూసినవారు
ఏజెన్సీ ప్రాంతాల్లో విజృంభిస్తున్న విష జ్వ‌రాలు
ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వ‌రాలు విజృంభిస్తున్నాయి. గిరిజ‌నులు విష జ్వ‌రాలు, మోకాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పుల‌తో తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. అల్లూరి సీతారామ‌రాజు జిల్లాలోని లాగ‌రాయి, ల‌బ్బ‌ర్తి, కిండ్ర గామాల నుంచి రెడ్రోజుల్లో సుమారు 100 మందికి పైగా రోగులు అనారోగ్య స‌మ‌స్య‌ల కార‌ణంగా ఆస్ప‌త్రిలో చేరారు. ఆస్ప‌త్రుల్లో రోగుల తాకిడి ఒక్క‌సారిగా పెరిగింది. దీంతో మెరుగైన సేవ‌లు అందించాల‌ని బాధితులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్