గురుకుల విద్యార్థులను వణికిస్తున్న విషజ్వరాలు

156చూసినవారు
గురుకుల విద్యార్థులను వణికిస్తున్న విషజ్వరాలు
AP: ఏజెన్సీ ప్రాంతాల్లోని గురుకుల విద్యార్థులు విషజ్వరాలతో వణికిపోతున్నారు. కురుపాం స్కూల్లో 150 మందికి పైగా పచ్చకామెర్ల బారిన పడగా, ఇద్దరు విద్యార్థులు మరణించారు. తాజాగా సాలూరు, ఇతర ప్రాంతాల్లో 2900 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇందులో 21 మందికి జ్వర లక్షణాలు కనిపించాయి. జాండీస్, మలేరియాతో బాధపడుతున్న వారికి చికిత్స అందిస్తున్నారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య లోపం, తాగునీటి ట్యాంకులను ఏళ్ల తరబడి శుభ్రం చేయకపోవడమే ఈ వ్యాధులకు ప్రధాన కారణాలని అధికారులు పేర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్