ముంబయి-పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై 40 గంటలుగా ట్రాఫిక్‌ జామ్‌ (వీడియో)

13987చూసినవారు
ముంబయి–పుణె ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ప్రమాదం తీవ్ర ట్రాఫిక్‌జామ్‌కు కారణమైంది. మహారాష్ట్ర రాయ్‌గడ్‌ జిల్లా ఖండాలాఘాట్‌లోని అదోషి టన్నెల్‌ సమీపంలో గ్యాస్‌ ట్యాంకర్‌ బోల్తా పడటంతో దాదాపు 40 గంటలుగా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. మహిళలు, చిన్నారుల సహా వేలాది మంది ప్రయాణికులు ఆహారం, తాగునీరు, టాయిలెట్‌, నిద్ర సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘటనాస్థలానికి ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌, బీపీసీఎల్‌ బృందాలు చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.

సంబంధిత పోస్ట్