రోడ్డుపై కొట్టుకున్న ట్రాఫిక్ పోలీసులు (వీడియో)

31602చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఫరూఖాబాద్‌లో ఇద్దరు ట్రాఫిక్ పోలీసులు నడిరోడ్డుపై ఘర్షణ పడ్డారు. అక్రమంగా వసూలు చేసిన మామూళ్ల పంపకంలో తేడా రావడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఒకరు రూ.5,000 వసూలైందని చెబితే, మరొకరు రూ.2,800 మాత్రమే వచ్చాయని వాదించారు. ఈ వాగ్వాదం కాస్తా గొడవకు దారితీసింది. యూనిఫాంలో ఉండి ఇలా బహిరంగంగా అవినీతికి పాల్పడుతూ, వీధి రౌడీల్లా ప్రవర్తించడం వ్యవస్థకే తీరని అవమానమని నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్