మంగళగిరి మరియు కృష్ణా కాలువ స్టేషన్ల మధ్య రూ.112 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి రైల్వేశాఖ ఆమోదం తెలిపింది. ఈ ఆర్వోబీ జాతీయ రహదారిని రాజధాని ఈ13 రోడ్డుతో అనుసంధానిస్తుంది. మంగళగిరి డాన్ బాస్ కో స్కూల్ సమీపంలో ఈ నిర్మాణం జరగనుంది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆరు లైన్ల ఆర్వోబీని నిర్మించడానికి అంగీకారం తెలిపింది.