AP: సంక్రాంతి సందర్భంగా ఏలూరు జిల్లా కలపర్రు టోల్‌గేట్ వద్ద దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ట్రాఫిక్‌ను పరిశీలించారు. ట్రాఫిక్ జామ్ కాకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వెనువెంటనే ట్రాఫిక్‌ను క్లియర్ చేయాలని సూచించారు. 100 మీటర్ల కన్నా ఎక్కువ వాహనాలు ఆగితే ఉచితంగా ముందుకు పంపించాలని టోల్ గేట్ అధికారులను ఆదేశించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయవద్దని వాహనదారులకు సూచించారు.