AP: తిరుపతి(D) ఏర్పేడు(M)లో విషాదం చోటు చేసుకుంది. ఎస్టీ కాలనీకి చెందిన శంకరయ్య, విజయమ్మకు కొడుకు, కుమార్తె సుస్మిత (6) సంతానం. మంగళవారం పిల్లలిద్దరిని స్కూల్‌కి పంపి.. దంపతులు అంత్యక్రియలకు వెళ్లారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తల్లిదండ్రులు లేకపోవడంతో.. కాలనీలోని పిల్లలతో కలిసి చెరువులో ఈతకెళ్లారు. సుస్మిత నీటితోకి దిగి గల్లంతైంది. తోటి పిల్లలు కాలనీవాసులు తెలపడంతో చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. సమాచారం అందుకున్న తల్లిదండ్రులు ఇంటికి చేరుకుని కూతురు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు.