AP: న్యూ ఇయర్ వేడుకల కోసం అంతర్వేది బీచ్‌కు వెళ్లిన ముగ్గురు యువకుల్లో ఒకరు కారుతో సహా గల్లంతయ్యారు. గోదావరి నది సముద్రంలో కలిసే చోట మలుపు వద్ద కారు నీళ్లలోకి దూసుకుపోయింది. ఒక యువకుడు బయటపడగా, శ్రీధర్ అనే మరో యువకుడు కారులోనే మృతి చెందాడు. పోలీసులు కారును బయటకు తీసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో శ్రీధర్ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాకినాడ నుంచి వచ్చిన ముగ్గురు స్నేహితులు అంతర్వేదిలోని యాపిల్ రిసార్ట్‌లో రూమ్ తీసుకుని పార్టీ చేసుకున్నారు. తర్వాత ఇద్దరు థార్ కారులో బీచ్‌లో డ్రైవింగ్ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.