TG: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై సాయితేజ అనే బాలుడు మృతిచెందాడు. ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్ పనుల్లో బాలుడితో పని చేయిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఘటనపై స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాలుడి మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.