విషాదం.. భార్య కళ్లెదుటే భర్త మృతి

5696చూసినవారు
విషాదం.. భార్య కళ్లెదుటే భర్త మృతి
AP: తిరుపతి(D) కేవీబీపురం(M)లో విషాదం చోటు చేసుకుంది. ఆదరం గ్రామానికి చెందిన వినోద్ (32) పదేళ్ల క్రితం మనీషాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు. వినోద్ తాపీమేస్త్రీగా, మనీషా అతని సహాయకురాలిగా కూలి పనులకు వెళ్తుంది. మంగళవారం ఐదో అంతస్తు వద్ద సిమెంట్ పూత పనికి దంపతులు వెళ్లారు. టిఫెన్ తినేందుకు వినోద్‌ను మనీషా పిలిచింది. అయితే అక్కడ అమర్చిన కర్రలు జారడంతో పట్టు తప్పి పైనుంచి కిందపడిపోయాడు. భార్య మనీషా కళ్లెదుటే వినోద్ మృతి చెందాడు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్