AP: తూర్పుగోదావరి జిల్లా, అనపర్తి మండలం పొలమూరు గ్రామానికి చెందిన ఆరు నెలల సిద్ధార్థ వీరన్, హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్స అనంతరం మృతి చెందాడు. చిన్నారి ప్రాణాలు కాపాడేందుకు దాతలు, ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆర్థిక సహాయం అందించారు. అమ్మమ్మ కాలేయంతో వైద్యులు శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తి చేసినప్పటికీ, ఊహించని విధంగా చిన్నారి మృతి చెందడంతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.