యూపీలోని ప్రతాప్‌గఢ్‌లో భారీ వర్షాల కారణంగా బుధవారం 100 ఏళ్ల నాటి ఇల్లు కుప్పకూలింది. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన సమయంలో ఏడుగురు ఒకే గదిలో నిద్రిస్తున్నారని, పైకప్పు కూలడంతో ఆరుగురు మరణించారని, ఒక కుమారుడు మాత్రం క్షేమంగా బయటపడ్డాడని అధికారులు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా ఇంటి గోడలు, పైకప్పు బలహీనపడి కూలిపోయినట్లు అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పోలీసులు, రెస్క్యూ సిబ్బంది జేసీబీలతో శిథిలాలను తొలగించి సహాయక చర్యలు చేపట్టారు.