TG: ఈత సరదా ఇద్దరు బాలుర ప్రాణం తీసింది. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఆదివారం ఈ ఘటన జరిగింది. ఎన్‌టీఆర్ కాలనీకి చెందిన నాగబాబు (13), పులి దేవ (11), షేక్ సైదులు కలిసి మెట్టాంజనేయస్వామి ఆలయం సమీపంలోని క్వారీలో ఈత కొట్టేందుకు దిగారు. లోతు ఎక్కువగా ఉండటంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. సుధారాణి అనే మహిళ సైదులును కాపాడగా, నాగబాబు, దేవను కాపాడలేకపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.