టాలీవుడ్‌లో విషాదం..నటి జయవాహిని కన్నుమూత

23749చూసినవారు
టాలీవుడ్‌లో విషాదం..నటి జయవాహిని కన్నుమూత
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ఒకప్పుడు సినిమాలు, సీరియల్స్‌లో కీలక పాత్రలతో గుర్తింపు తెచ్చుకున్న నటి జయవాహిని కన్నుమూశారు. హైదరాబాద్‌ మణికొండలోని తన నివాసంలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న జయవాహిని ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందినట్లు తెలుస్తోంది. ఆమె మృతదేహాన్ని స్వస్థలం శ్రీకాకుళం జిల్లాకు తరలించగా, అక్కడే ఇవాళ (గురువారం) అంత్యక్రియలు నిర్వహించనున్నారు. జయవాహిని మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు.

సంబంధిత పోస్ట్