AP: మెగా డీఎస్సీలో కొత్తగా ఎంపికైన టీచర్లకు అక్టోబర్ 3వ తేదీ నుంచి శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్ ఖరారు చేశారు. డీఎస్సీ-2025లో ఎంపికైన ఉపాధ్యాయులకు అక్టోబర్ 3 నుంచి 10 వరకు శిక్షణ ఉండనుంది. పోస్టింగుల కోసం 9, 10 తేదీల్లో వెబ్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అయితే పంచాయతీ కార్యదర్శులు, కానిస్టేబుళ్లుగా పనిచేస్తూ డీఎస్సీకి ఎంపికైన వారికి సెలవులు మంజూరు కావడంలేదని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోస్టింగ్ ఇచ్చినప్పటి నుంచే విధుల నుంచి రిలీవ్ ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. అ