ఏపీలో ఖైదీలకు ఏఐ సహా ఐటీ కోర్సుల్లో శిక్షణ

37చూసినవారు
ఏపీలో ఖైదీలకు ఏఐ సహా ఐటీ కోర్సుల్లో శిక్షణ
AP: విశాఖపట్నం సెంట్రల్ జైలులో ఖైదీలకు ఐటీ నైపుణ్యాలపై శిక్షణ ఇచ్చే వినూత్న కార్యక్రమం ప్రారంభమైంది. విడుదలయ్యాక గౌరవప్రదమైన జీవితాన్ని అందించే లక్ష్యంతో ఆఫీస్ అసిస్టెంట్ కోర్సులో శిక్షణ ఇస్తున్నారు. ప్రస్తుతం 35 ఏళ్లలోపు రిమాండ్ ఖైదీలను ఎంపిక చేసి, ఐఐటీ ప్రొఫెసర్ వీరికి పాఠాలు బోధిస్తున్నారు. జైళ్లు కేవలం శిక్షా కేంద్రాలుగా కాకుండా, ఖైదీలకు ఉపాధి మార్గాలను చూపిస్తూ, వారి జీవితాలను మార్చే కేంద్రాలుగా మారుస్తున్నామని అధికారలు తెలిపారు.

సంబంధిత పోస్ట్