రష్యాలో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి అబ్దుల్ కయ్యం తెలిపారు. ఆరు నెలల పాటు శిక్షణ ఇస్తారని, ఈ సమయంలో భోజనం, వసతితో పాటు స్కాలర్‌షిప్ కూడా అందిస్తారని ఆయన పేర్కొన్నారు. 18 నుంచి 20 సంవత్సరాల మధ్య వయస్సు, ఇంగ్లీషులో 75% మార్కులు సాధించిన అభ్యర్థులు సెప్టెంబర్ 26లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.