వయసుతో సంబంధం లేకుండా మోకాలి నొప్పుల సమస్య పెరుగుతోంది. ఎక్కువసేపు కూర్చోవడం, కొన్ని ఆహారపు అలవాట్లు దీనికి కారణం. క్యారెట్ తురుము, నిమ్మరసం కలిపి తీసుకోవడం లేదా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే నీళ్లు సమృద్ధిగా తాగడం వల్ల మోకాలి చుట్టూ ఉన్న కార్టిలేజ్ లూబ్రికేట్ అవుతుంది. ఉల్లిపాయలలోని యాంటీ ఇంఫ్లేమేటరీ గుణాలు, సల్ఫర్ కంటెంట్ మోకాళ్ల నొప్పులను తగ్గించి, రోగ నిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి.