స్కూల్‌ బస్సుపై విరిగిపడిన చెట్టు.. విద్యార్థి మృతి (వీడియో)

18183చూసినవారు
ముంబైలోని చెంబూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులతో వెళ్తున్న పాఠశాల బస్సుపై భారీ చెట్టు విరిగిపడటంతో ఒక విద్యార్థి మృతి చెందగా, మరో 10 మంది గాయపడ్డారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 18 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. చెట్టు కొమ్మలు తొలగించాలని గతంలోనే మున్సిపల్ కార్పొరేషన్‌కు పలుమార్లు లేఖలు రాసినా అధికారులు పట్టించుకోలేదని స్థానికులు ఆరోపిస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్