కల్తీ మద్యం కేసులో మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ సోదరుల ఐదు రోజుల కస్టడీలో నాలుగో రోజు పూర్తయింది. సిట్ అధికారులు వీరిద్దరిని ప్రశ్నించారు. ఈ కేసులో ఇప్పటికే రిమాండ్ ఖైదీలుగా ఉన్న జోగి రమేశ్, ఆయన సోదరుడు రాములను మరింత విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.