ఏజెన్సీలో రోడ్లు నిర్మించాలని గిరిజనుల వినూత్న నిరసన (వీడియో)

71చూసినవారు
AP: కూట‌మి ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజ‌నుల‌ వినూత్న నిరసన చేపట్టారు. శనివారం విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నెత్తిపై అడ్డాకులు పెట్టుకుని, డోలీ మోతతో ఆందోళన చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో వెంటనే రోడ్లను నిర్మించాలని డిమాండ్‌ చేశారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినా గిరిజనులకు న్యాయం జరగలేదని ఆవేద‌న‌ వ్యక్తం చేశారు. అనారోగ్యంతో గిరిజనులకు డోలీ మోతలు తప్పడం లేదన్నారు.

సంబంధిత పోస్ట్