AP : ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జి. కొండూరు మండలం కట్టుబడి పాలెంకు చెందిన గిరిజనులు టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. మంత్రి కొల్లి రవీంద్ర అనుచరుడు పామర్తి రాజా తమతో పనులు చేయించుకొని 200 మందికి రూ.1.50 కోట్లు ఇవ్వలేదని, డబ్బుల కోసం తిరిగినా పట్టించుకోకుండా అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన డబ్బులు ఇచ్చేవరకు ఆందోళన కొనసాగిస్తామని గిరిజనులు తెలిపారు.