బెంగళూరులోని ఎం. చిన్నస్వామి స్టేడియంలో నేడు ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్ జట్ల మధ్య జరిగిన ఐపీఎల్ మ్యాచ్ ప్రారంభమైంది. గత సంవత్సరం ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ విజయోత్సవ ర్యాలీలో, చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన 11 మంది అభిమానులకు నివాళిగా నేడు స్డేడియంలో 11 సీట్లు రిజర్వ్ చేశారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో, బాధితులకు నివాళులర్పిస్తూ, 2026 సీజన్ ప్రారంభోత్సవ వేడుకలను బీసీసీఐ రద్దు చేసింది.