AP: మహాకవి రవీంద్రనాథ్ ఠాగూర్‌కు మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులర్పించారు. ఠాగూర్ దేశ స్వాతంత్ర్య పోరాటంలో 'జన గణ మన'తో జాతీయ స్ఫూర్తిని రగిలించారని, భారత దేశం నుంచి నోబెల్ బహుమతిని అందుకున్న తొలి వ్యక్తి ఆయనేనని
జగన్ కొనియాడారు. తన సాహిత్యం, మానవతా విలువలతో భారతీయ సంస్కృతిని విశ్వవ్యాప్తం చేసిన మహానుభావుడని, ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పిస్తున్నట్లు వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.