వివాహం, విడాకులపై త్రిష సంచలన వ్యాఖ్యలు వైరల్

10580చూసినవారు
వివాహం, విడాకులపై త్రిష సంచలన వ్యాఖ్యలు వైరల్
దక్షిణాది స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ గతంలో వివాహం, విడాకులపై చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మళ్లీ చర్చనీయాంశంగా మారాయి. వివాహ వ్యవస్థపై తనకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయని, విడాకులను తాను నమ్మనని ఆమె అప్పట్లో పేర్కొన్నారు. అందుకే పెళ్లి నిర్ణయం తీసుకునే ముందు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తానని తెలిపారు. కేవలం వయసు, ఒంటరితనం కారణంగా తప్పుడు నిర్ణయాలు తీసుకోనని, తనకు నచ్చిన వ్యక్తి దొరికితేనే వివాహం చేసుకుంటానని, లేదంటే ఒంటరిగా ఉండటానికీ సిద్ధమేనని ఆమె వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వివాహంపై వస్తున్న పుకార్ల నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరోసారి వైరల్ అవుతున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్