ఎన్టీఆర్ కథానాయకుడిగా, త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ కొత్త చిత్రం రానుంది. పురాణాలతో ముడిపడిన కథతో తెరకెక్కనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కార్తికేయుడి పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ఎన్టీఆర్ స్వయంగా ప్రకటించారు. శివుడి కుమారుడు, దేవ సేనాని అయిన కార్తికేయుడి కథను త్రివిక్రమ్ వెండితెరపై ఆవిష్కరించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, హారిక, హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.