అత్యాచార బాధితురాలిని పరామర్శించిన TRS చీఫ్ కవిత(వీడియో)

3430చూసినవారు
TG: ఖమ్మం జిల్లాలో అత్యాచారం, హత్యాయత్నానికి గురై తీవ్రంగా గాయపడి హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత బాలికను శనివారం టీఆర్ఎస్ చీఫ్ కవిత పరామర్శించారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడారు. నిందితుడిని ఉరితీయాలని బాధితురాలి తల్లి డిమాండ్ చేస్తున్నట్లు కవిత తెలిపారు. బాధిత కుటుంబానికి నెలకు రూ. 50 వేల పింఛన్, ఇల్లు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఇటువంటి దారుణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని  సీఎం రేవంత్ రెడ్డికి కవిత విజ్ఞప్తి చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్