ఆగివున్న బస్సును ఢీకొట్టిన ట్రక్.. ఐదుగురు మృతి

24408చూసినవారు
ఉత్తరప్రదేశ్‌లోని ఏటా జిల్లాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏటా-అలీగంజ్ రోడ్డు మార్గంలో ప్రయాణికులతో నిలిచి ఉన్న ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ బస్సును, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన క్యాంటర్ ట్రక్ బలంగా ఢీకొట్టింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ట్రక్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్