ఇరాన్‌కు విధించిన డెడ్‌లైన్ గడువును మరో రెండు వారాలపాటు పొడిగిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. పాక్ అభ్యర్థన మేరకు 14 రోజులపాటు దాడులు నిలిపివేసేందుకు అంగీకరించానని చెప్పారు. హార్ముజ్‌ను వెంటనే తెరిచేందుకు ఇరాన్ అంగీకరించిందన్న షరతుకు లోబడి దీనికి ఒప్పుకున్నట్లు తెలిపారు. ఈ సీజ్‌ఫైర్ ఇరువైపులా వర్తిస్తుందన్నారు. ఇరాన్ 10 పాయింట్ల ప్రపోజల్ అందిందని, శాంతి ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.