ఇరాన్‌తో తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి హెచ్చరికలు చేశారు. ఇరాన్‌కు ఆయుధాలు సరఫరా చేసే దేశాలపై ఆంక్షలు విధిస్తామని ప్రకటించారు. ఇరాన్‌కు ఆయుధ మద్దతు ఇస్తే వారిపై 50 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. ఇరాన్ యురేనియం శుద్ధిని నిలిపివేయాలని ఆదేశించారు.