మహిళా రిపోర్టర్‌పై ట్రంప్ ఆగ్రహం

2478చూసినవారు
మహిళా రిపోర్టర్‌పై ట్రంప్ ఆగ్రహం
వైట్ హౌస్‌లో జరిగిన మీడియా సమావేశంలో సీఎన్ఎన్ రిపోర్టర్ కైట్లాన్ కొల్లిన్స్‌ను 'చెత్త రిపోర్టర్' అంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా విమర్శించారు. ఎప్ స్టీన్ సెక్స్ స్కాంపై కొల్లిన్స్ అడిగిన సూటి ప్రశ్నలకు ఆగ్రహించిన ట్రంప్, ఆమె ఎప్పుడూ నవ్వదని, సీఎన్ఎన్ రేటింగ్స్ పడిపోవడానికి ఆమెలాంటి వాళ్లే కారణమని ఆరోపించారు. కొల్లిన్స్ మాత్రం తన ప్రశ్నల పరంపరను కొనసాగించారు. ఈ సంఘటనతో కైట్లాన్ కొల్లిన్స్ మరోసారి వార్తల్లో నిలిచారు. ఆమె తన రిపోర్టింగ్ సమయంలో గంభీరంగా ఉంటారని, ఇది బాధ్యతాయుతమైన జర్నలిజం లక్షణమని మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి.

సంబంధిత పోస్ట్