అమెరికా అధ్యక్షుడిగా డోనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టాక, ముఖ్యంగా క్రిప్టోకరెన్సీ వ్యాపారం ద్వారా ఊహించని స్థాయిలో లాభాలు ఆర్జించారు. ప్రభుత్వ నైతికత విభాగం నివేదికల ప్రకారం, ట్రంప్ మొత్తం వార్షిక ఆదాయం రూ.21వేల కోట్లకు చేరింది. 'వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్' అనే క్రిప్టో సంస్థ ద్వారా రూ.13,300 కోట్లు సంపాదించారు. డిజిటల్ టోకెన్ల విక్రయాల ద్వారా రూ.5,600 కోట్లకు పైగా, 'ది న్యూయార్క్ టైమ్స్' ప్రకారం రూ.7,600 కోట్లు ఆర్జించారు.