కల్తీ నెయ్యి కేసు.. దేశవ్యాప్తంగా 15 చోట్ల ఈడీ సోదాలు

1008చూసినవారు
కల్తీ నెయ్యి కేసు.. దేశవ్యాప్తంగా 15 చోట్ల ఈడీ సోదాలు
AP: తిరుమల కల్తీ నెయ్యి కేసులో ఈడీ దూకుడు పెంచింది. దేశవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. అహిల్యానగర్, బికనీర్, డెహ్రాడూన్, ఢిల్లీ, గుంటూరు, ముంబై, రూర్కీల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కీలక నిందితులైన పోమిల్ జైన్, విపిన్ జైన్, రాజు రాజశేఖరన్, రాజేష్ చావ్డా, అపూర్వ చావ్డా, మచీంద్ర శాంతారామ్ లాంకే, అజయ్ కుమార్ సుగంధ్, మహేష్ కుమార్ రోహిరా, ఆశిష్ అగర్వాల్‌ల ఇళ్లు, ఆఫీసుల్లో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో రూ.60 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. రూ.45 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తుల్లో పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్