AP: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథంను ఏసీబీ అధికారులు గురువారం అరెస్టు చేశారు. లోకనాథం ఇల్లు, కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నిన్న ఉదయం నుంచి ఇవాళ్టి వరకు ఏసీబీ తనిఖీలు కొనసాగాయి. ఇవాళ నెల్లూరు ఏసీబీ కోర్టులో లోకనాథంను హాజరుపరచనున్నారు. లోకనాథం ఇంట్లో రూ.5 కోట్ల విలువైన ఆస్తులు గుర్తించారు.