నేడు టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు

17చూసినవారు
నేడు టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో సోదాలు
AP: టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం ఇంట్లో గురువారం ఏసీబీ సోదాలు చేయనుంది. నిన్న లోకనాథం ఇంట్లో రూ.5 కోట్ల విలువ గల ఆస్తులు ఏసీబీ అధికారులు గుర్తించారు. 2 కిలోల బంగారం, 6.5 కిలోల వెండి, రూ.12 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. కాగా, కల్తీ నెయ్యి కేసులో వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నఅప్పన్న విచారణలో కీలక అంశాలు వెల్లడించారు. చిన్నఅప్పన్న విచారణ అంశాల ఆధారంగా లోకనాథంపై కేసు నమోదు చేశారు.

సంబంధిత పోస్ట్