AP: తిరుమల వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన చేసింది. డిసెంబర్, జనవరి నెలల్లోని పర్వదినాల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. వైకుంఠ ఏకాదశి, రథసప్తమి రోజుల్లో ఆంక్షలు అమలుకానున్నాయి. ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే మినహాయింపు ఉంటుందని టీటీడీ వెల్లడించింది. సిఫారసు లేఖలు స్వీకరించబోమని టీటీడీ స్పష్టం చేసింది.